కర్నాటకలో దొంగ నోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఏపీ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజనీపై వేటుపడింది. పదవి నుంచి తొలగిస్తూ జగన్ సర్కార్ జీవో ఇచ్చింది . రెండ్రోజులక్రితమే జీవో ఇచ్చినా, ఈరోజు బయటికొచ్చింది. రజని నకిలీ కరెన్సీ బాగోతం బయటికి వచ్చిన రోజే ఆమెను పదవి నుంచి తప్పించింది ప్రభుత్వం. దొంగ నోట్ల వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. ఫేక్ కరెన్సీ చెలామణి చేస్తూ ఏపీ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజని అరెస్ట్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె నుంచి నాలుగు లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం కూడా సంచలనంగా మారింది.
రజని వ్యవహారం తలనొప్పిగా మారడంతో ఆమెను పదవి నుంచి తప్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బొందిలి కార్పొరేషన్‌లో నాన్-అఫిషియల్ డైరెక్టర్‌గా ఉన్న రజనీ నియామకాన్ని నిలుపుదల చేయడంతోపాటు ఆమెను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.