Biswa Bhusan Harichandan : ‘ఆలస్యం చేయొద్దు.. అర్హులైన వారందరూ కచ్చితంగా తీసుకోవాలని చెబుతోన్న ఏపీ గవర్నర్’
Biswa Bhusan Harichandan : అర్హులైన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ ఆలస్యం చేయకుండా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్..
Biswa Bhusan Harichandan : అర్హులైన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ ఆలస్యం చేయకుండా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ సూచించారు. గవర్నర్ బిస్వ భూషన్, లేడీ గవర్నర్ సుప్రవ హరిచందన్ బుధవారం విజయవాడలోని రాజ్ భవన్ లో రెండవ మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవాక్జిన్ టీకా సెకండ్ డోస్ తీసుకున్న అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. టీకా తీసుకున్న తర్వాత జ్వరం, వంటి నొప్పులు వంటి ప్రతికూల ప్రభావాలేవీ తాను అనుభవించలేదని చెప్పారు.
సమాజ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం, కచ్చితంగా అవసరమని కూడా గవర్నర్ అన్నారు. కోవిడ్ భారిన పడకుండా విధిగా మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉంటూ కుటుంబాన్ని రక్షించుకోవాలని గవర్నర్ సూచించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, టీకా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. కోవిడ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని గవర్నర్ హరిచందన్ చెప్పారు.
Hon’ble Governor Sri Biswa Bhusan Harichandan & Lady Governor Smt. Suprava Harichandan have taken 2nd dose of #Covidvaccine at Raj Bhavan. Governor said it is necessary to take vaccine for health of society to fight menace of #Covid_19 .https://t.co/j6LuQEXTrP
— Governor of Andhra Pradesh (@governorap) March 31, 2021