ఏపీలో ఈసీ వర్సెస్ సర్కార్…సుప్రీం కోర్టుకు వాయిదా వార్ !

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని..

ఏపీలో ఈసీ వర్సెస్ సర్కార్...సుప్రీం కోర్టుకు వాయిదా వార్ !
Follow us

|

Updated on: Mar 16, 2020 | 7:38 AM

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా, ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నారని,… ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుకే ముగిస్తే పాలన బలపడుతుంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావాల్సిన రూ. 5వేల కోట్లు ఆగిపోయే ప్రమాదముందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కరోనా వైరస్‌ ప్రభావంపై చీఫ్‌ సెక్రటరీతో గానీ, హెల్త్‌ సెక్రెటరీతోగానీ సమీక్షించకుండా, సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించనుంది. కరోనా లాంటి వ్యాధుల నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకం. ఆ సంస్థల్లోని ప్రజాప్రతినిధుల ద్వారా మరింత సమర్థంగా కార్యక్రమాలు చేపట్టవచ్చు అని సుప్రీంకోర్టుకు నివేదించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం.