ఎన్నికల వాయిదా.. ఈసీకి ఏపీ సీఎస్ లేఖ.. ఏమన్నారంటే..!

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని

ఎన్నికల వాయిదా.. ఈసీకి ఏపీ సీఎస్ లేఖ.. ఏమన్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2020 | 8:29 AM

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని లేఖలో పేర్కొన్న సీఎస్.. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అన్నారు. కేవలం ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె అన్నారు. స్థానికంగా ఎవ్వరికీ కరోనా సొకలేదని.. రానున్న మూడు నాలుగు వారాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉండదని నీలం సాహ్ని పేర్కొన్నారు. నాలుగు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా వేయలేమన్న సీఎస్.. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని వినతి చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది.

Read This Story Also: విజృంభిస్తోన్న ‘కరోనా’.. ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండిలా..!