AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ: స్కూళ్ల అకాడమిక్ క్యాలెండర్ ఇదే.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే.?

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. స్కూళ్లకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరానికి గానూ అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

ఏపీ: స్కూళ్ల అకాడమిక్ క్యాలెండర్ ఇదే.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే.?
Schools Students
Ravi Kiran
|

Updated on: Jun 09, 2023 | 9:37 AM

Share

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. స్కూళ్లకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరానికి గానూ అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 12 నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని, మొత్తం 229 రోజులు పని చేస్తాయని తెలిపింది. అలాగే 88 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయని పేర్కొంది.

సెలవుల విషయానికొస్తే.. దసరా సెలవులు అక్టోబర్ 14-24, నవంబర్ 12న దీపావళి, సంక్రాంతి సెలవులు జనవరి 9-18 వరకు ఉంటాయి. అటు క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు దసరాకు అక్టోబర్ 21-24, క్రిస్మస్‌కు డిసెంబర్ 17-26, సంక్రాంతికి జనవరి 10-18 సెలవులుగా ప్రకటించారు.

ఎగ్జామ్స్ విషయానికొస్తే.. ఫార్మెటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9వ తరగతులకు ఆగష్టు 1-4, ఫార్మెటివ్-2 పరీక్షలు అక్టోబర్ 3-6 వరకు, సమ్మెటివ్-1 పరీక్షలు నవంబర్ 4-10, ఫార్మెటివ్-3(సీబీఏ) జనవరి 3-6, ఫార్మెటివ్-4 ఫిబ్రవరి 23-27 వరకు ఉంటాయని స్పష్టం చేశారు. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మెటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు ఉంటాయి.

కాగా, జూన్ 12న స్కూల్స్ తిరిగి ప్రారంభమైన రోజే.. విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. అటు 8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్‌లో ట్యాబ్‌ల పంపిణీ ఉండనుందన్నారు.