మాట నిలుపుకున్న సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు. రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నారు. ఇచ్చిన మాటప్రకారం పదిమంది కుటుంబాలకు యాభై లక్షల చొప్పున అందివ్వనున్నారు...

మాట నిలుపుకున్న సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 25, 2020 | 10:36 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు. రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నారు. ఇచ్చిన మాటప్రకారం పదిమంది కుటుంబాలకు యాభై లక్షల చొప్పున అందివ్వనున్నారు.

మరికాసేపట్లో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ,ఆళ్ల నాని ,కొడాలి నాని ,వెల్లంపల్లి శ్రీనివాస్ అందించనున్నారు. పదిమంది ప్రాణాలు పోయినా పట్టించుకోకుండా పారిపోయిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరారీలో ఉన్న ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి పరారైన వ్యక్తులను పట్టిస్తే లక్ష పారితోషికం ప్రకటించిన సంగతి తెలిసిందే.