AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ జిల్లాల్లో రెండ్రోజుల ముందే పెన్షన్ల పంపిణీ..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సాధారణంగా జరిగే తేదీ కంటే రెండు రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం అల్లూర అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.

అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ జిల్లాల్లో రెండ్రోజుల ముందే పెన్షన్ల పంపిణీ..!
Ap Government Pension Distribution
Balaraju Goud
|

Updated on: Jul 23, 2026 | 6:08 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సాధారణంగా జరిగే తేదీ కంటే రెండు రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం అల్లూర అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఆరు జిల్లాల్లో మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారులకు రూ.514.42 కోట్ల మేర ముందస్తు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరు జిల్లాల్లో మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారులకు రూ.514.42 కోట్ల మేర పెన్షన్ నగదు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జూలై 29వ తేదీలోగా అవసరమైన నగదు ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు సమయానికి పెన్షన్ అందేలా గ్రామ, వార్డు స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిపాలనా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పెన్షన్లను ముందుగానే పంపిణీ చేయడం వల్ల వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా , ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
స్వాతంత్ర్య వేడులకు ఖర్గే, రాహుల్ దూరం..!
స్వాతంత్ర్య వేడులకు ఖర్గే, రాహుల్ దూరం..!
శ్రీశైలంలో టీటీడీ తరహాలో వీఐపీ లెటర్లకు దర్శనం
శ్రీశైలంలో టీటీడీ తరహాలో వీఐపీ లెటర్లకు దర్శనం
స్క్రీన్‌ను తాకగానే ఫోన్‌కు ఎలా తెలిసిపోతుంది? అసలు సీక్రెట్ ఇదే!
స్క్రీన్‌ను తాకగానే ఫోన్‌కు ఎలా తెలిసిపోతుంది? అసలు సీక్రెట్ ఇదే!
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశ..
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశ..
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
డాట్ బాల్స్‌తో పిచ్చెక్కించిన తోపు బౌలర్లు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?