Andhra Pradesh: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ఫీజు..

|

Aug 12, 2022 | 8:42 AM

ఇక నుంచి ఇలా రోడ్ల పక్కన ఇళ్లను నిర్మించుకునేవారు ప్రస్తుతం వసూలు చేస్తున్న లైసెన్స్‌ ఫీజులు, ఇతర ఛార్జీలతో పాటు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ఫీజు..
Andhra Pradesh
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఏపీలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ఫీజును వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తాజాగా సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసింది జగన్ సర్కార్. 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రోడ్ల పక్కన కొత్తగా నిర్మించే నాన్ కమర్షియల్ భవనాలకు ఫీజు వసూలు చేయనుంది ఏపీ సర్కార్. ఇక నుంచి ఇలా రోడ్ల పక్కన ఇళ్లను నిర్మించుకునేవారు ప్రస్తుతం వసూలు చేస్తున్న లైసెన్స్‌ ఫీజులు, ఇతర ఛార్జీలతో పాటు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఇంపాక్ట్ ఫీజుని నాలుగు కేటగిరీలుగా నిర్ధారించారు.

విజయవాడ, గుంటూరు, విశాఖ నగరపాలక సంస్థలు ఒక కేటగిరి

ఇవి కూడా చదవండి

మిగిలిన నగరపాలక సంస్థల్ని ఒక కేటగిరి

పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఒక కేటగిరి

నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పంచాయతీలన్నీ ఒక కేటగిరి

ప్రస్తుతం ఉన్న రోడ్లతో పాటు కొత్తగా నిర్మించే రోడ్ల పక్కన నిర్మాణాలకు ఇక నుంచి వినియోగదారులు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఇంపాక్ట్ ఫీజు నిధులు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయనున్నది ప్రభుత్వం. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని.. తిరిగి ఆయా ప్రాంత అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇంపాక్ట్‌ ఫీజుగా వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేకమైన ఖాతాలో డిపాజిట్ చేయనున్నామని.. అనంతరం.. ఆ డబ్బులను ఆయా రోడ్ల నిర్మాణం,మౌలిక వసతుల కోసం నిధులు ఖర్చున పెట్టనున్న ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..