AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పాఠశాలలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పాఠశాలలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
Ap Schools
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2022 | 8:03 PM

Share

AP Schools: కరోనా కట్టడిపై సీఎం జగన్(CM Jagan) సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌(Covid-19) వ్యాప్తి పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా దాదాపు చికిత్సతో కోలుకుంటున్నారని వివరించారు. క్రమంగా పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు  1.06లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని తెలిపారు.  18 ఏళ్ల పైబడ్డ  90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్‌(Corona Vaccination) పూర్తయ్యిందన్న అధికారులు సీఎంకు వివరించారు. అన్నిజిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.  కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నవారికి మంచి సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారికి అర్హులైన వారు అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పూర్తిస్థాయిలో అందిచాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని సూచించారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బీమా సంస్థలు రేట్లకన్నా.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు మంచి రేట్లు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో పాఠశాలలు మూసే ప్రస్తక్తే లేదు…

రాష్ట్రంలోని ఏ పాఠశాలనూ మూసివేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీచర్ల సంఖ్యను కుదించేది లేదని.. అంగన్ వాడీ కేంద్రాలను తగ్గించేది లేదని వెల్లడించింది. అంగన్ వాడీ టీచర్లు, వర్కర్ల సంఖ్య తగ్గించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

Also Read: కొత్త జిల్లాల ఏర్పాటుపై బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్.. హిందూపురం గురించి కీలక వ్యాఖ్యలు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్