AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Sameer Sharma: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ..

Andhra Pradesh new chief secretary : ఏపీలోని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మను నియమించింది. అక్టోబర్‌ 1 నుంచి సమీర్‌ శర్మ

IAS Sameer Sharma: జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ..
Sameer Sharma, Ias
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2021 | 12:37 PM

Share

Andhra Pradesh new chief secretary : ఏపీలోని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మను నియమించింది. అక్టోబర్‌ 1 నుంచి సమీర్‌ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. సమీర్‌ శర్మ ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నెల 30న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సమీర్ శర్మ సెంట్రల్ సర్వీసెస్‌లో కొనసాగుతున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే.. సమీర్‌ శర్మ కూడా రెండు నెలల్లో.. పదవీ విరమణ చేయనున్నారని సమాచారం. ఈ తరుణంలో ఆయన రాష్ట్ర కేడర్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. బాధ్యతలు చేపట్టిన అనంతరం సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా.. అంతకుముందు జూన్‌ 26 ప్రభుత్వం ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదిత్యనాథ్‌దాస్‌ జూన్ 30తో పదవీవిరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సీఎస్‌ పదవీకాలాన్ని మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి.

Also Read:

Crime News: గణేష్ ఉత్సవాల్లో అపశృతి.. మంటలు చెలరేగి 9 మందికి తీవ్ర గాయాలు..

Kairathabad Ganesh: ఖైరతాబాద్ గణపయ్యకు గవర్నర్‌ తమిళిసై తొలిపూజ.. రుద్ర మహాగణపతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్త జనం