Crime News: గణేష్ ఉత్సవాల్లో అపశృతి.. మంటలు చెలరేగి 9 మందికి తీవ్ర గాయాలు..

Fire Accident in Kadapa District: వినాయకచవితి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహం తీసుకెళుతున్న ట్రాక్టర్‌లోని బాణాసంచాకు నిప్పు అంటుకోవటంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం

Crime News: గణేష్ ఉత్సవాల్లో అపశృతి.. మంటలు చెలరేగి 9 మందికి తీవ్ర గాయాలు..
Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 10, 2021 | 11:56 AM

Fire Accident in Kadapa District: వినాయకచవితి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహం తీసుకెళుతున్న ట్రాక్టర్‌లోని బాణాసంచాకు నిప్పు అంటుకోవటంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన వారిలో న‌లుగురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కడప జిల్లాలోని పెనగళూరు మండలంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి విగ్రహం తీసుకెళుతుండగా.. ట్రాక్టర్‌లోని బాణాసంచాకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా.. వారిలో న‌లుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిన వారిన 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులు మండలంలోని సాతుపల్లి గ్రామస్తులని పోలీసులు పేర్కొన్నారు. పండుగ వేళ ప్రమాదం చోటుచేసుకోవ‌డంతో గాయ‌ప‌డిన వారి కుటుంబాలు కనన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. వీరిలో కొంతమందికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని వారికి చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: మహిళా ఉద్యోగిపై కీచకుడి కన్ను.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసి..

Vizianagaram District: పాపం ఆడపిల్ల లిఫ్ట్ అడిగింది కదా అని ఇచ్చాడు… ఆపై ఊహించని సీన్