Robbery Video: పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు.. క్షణాల్లో దోచుకెళ్లారు.. వైరల్‌ వీడియో

Petrol Pump Robbery Case: పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నప్పికీ.. దొంగతనాలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఓ పెట్రోల్‌

Robbery Video: పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు.. క్షణాల్లో దోచుకెళ్లారు.. వైరల్‌ వీడియో
Petrol Pump Robbery Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 10, 2021 | 11:27 AM

Petrol Pump Robbery Case: పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నప్పికీ.. దొంగతనాలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఓ పెట్రోల్‌ బంక్‌పై దొంగలు విరుచుకుపడ్డారు. వచ్చి రాగానే పెద్ద పెద్ద కత్తులతో బెదిరించి భారీ ఎత్తున నగదును దోచుకెళ్లారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ సంఘటన తమిళనాడు చెన్నై సమీపంలోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా కీలకరై పట్టణ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు ముగ్గురు యువకులు బైక్‌పై రాత్రివేళ వచ్చి దోచుకెళ్లారు. ఈ క్రమంలో బంక్‌ సిబ్బంది ముగ్గురు క్యాష్‌ ఉంచిన టేబుల్‌ దగ్గర కూర్చొని ఉన్నారు. బైక్‌పై వచ్చి రాగానే దుండగులు పెద్ద పెద్ద కత్తులతో టేబుల్‌పై దాడి చేశారు. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే ముఖానికి వస్త్రాన్ని చుట్టుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు టేబుల్‌లో ఉన్న నగదును తీసుకొని పరారయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దోపిడీ ఘటనపై బంక్‌ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించి సీసీ విజువల్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు కీలకరై పోలీసులు తెలిపారు. అయితే.. ఎంత మొత్తం నగదు దొపిడీ గురైందో స్పష్టంగా తెలియరాలేదు.

వీడియో..

ఇదిలాఉంటే.. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.లాల్‌ కోఠి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జైపూర్‌ సెంట్రల్‌ జైలు సమీపంలోని పెట్రోల్‌ బంకులో కూడా దుండగులు దోపిడికి పాల్పడ్డారు. తుపాకీలతో గురువారం తెల్లవారుజామున బంకుకు వచ్చిన దుండగులు.. సిబ్బందిపై దాడి చేసి 1.5లక్షలను దోచుకెళ్లారు.

Also Read:

Crime News: మహిళా ఉద్యోగిపై కీచకుడి కన్ను.. డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసి..

Guntur Gang Rape: వరుస అత్యాచారాలు, హత్యలు.. గుంటూరు జిల్లాలో హడలిపోతున్న మహిళలు

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?