AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారని తెలిపారు.

Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Tirumala Laddus Row
Shaik Madar Saheb
|

Updated on: Feb 12, 2025 | 5:02 PM

Share

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషకరమని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ కల్తీ ఘటన దురదృష్టకరమన్నారు. భక్తుల మనోభావాలు గాయపడకూడదు అన్నదే తన ఆవేదన అని.. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు అన్నదే తన బలమైన ఆకాంక్ష అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం – ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం. సంతోషించదగిన విషయం. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి.. అని సూచించారు.

ఇది నా వ్యక్తిగత పర్యటన..

దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని, రాజకీయాలకు సంబంధం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల నిమిత్తం… తన ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చిందన్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నానన్నారు.

ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామమని.. పవన్ కల్యాణ్ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..