Andhra Pradesh: గుడ్ న్యూస్‌.. ఇవాళ వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించే కార్యక్రమంలో 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.

Andhra Pradesh: గుడ్ న్యూస్‌.. ఇవాళ వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేయనున్న సీఎం జగన్‌
CM Jagan
Follow us

|

Updated on: Jan 30, 2023 | 8:36 AM

చిన్న తరహా వ్యాపారుల సంక్షేమార్థం సీఎం జగన్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో భాగంగా దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈక్రమంలో జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించే కార్యక్రమంలో 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. మూడో విడతతో కలిపి ఇప్పటివరకూ రూ.927.39 కోట్లను లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గతేడాది అర్హులై ఉండి డబ్బులు రాని వారికి ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు ముఖ్యమంత్రి జగన్ వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 గంటల మధ్య వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

పథకంలో ఎలా చేరాలి ?

జగనన్న చేదోడు పథకంలో చేరాలని భావించే వారు సచివాలయం వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది… అవసరమైన డాక్యుమెంట్లును తీసుకెళ్లాలి, సచివాలయం సిబ్బంది స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి మీకు సహాయ పడతారు… ఇకపోతే గత ఏడాది స్కీమ్ కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది…

అర్హతలివే..

1. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి

ఇవి కూడా చదవండి

2. రైస్ కార్డు కలిగి ఉండాలి

3. రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..