Andhra Pradesh: ఆక్వా రైతులకు అండగా సీఎం జగన్.. వారిపై సీరియస్.. వెంటనే మంత్రులు కమిటీ ఏర్పాటు
వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి. వ్యాపారులు సిండికేట్‌గా మారితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రైతులకు అండగా నిలవాలి. ఆక్వా రంగంలో రైతుల ఫిర్యాదుపై సీఎం జగన్ సీరియస్ యాక్షన్ ఇది. మంత్రులతో కమిటీ వేసి చర్యలకు ఆదేశించారు ముఖ్యమంత్రి.
ఆక్వా రైతుల ఫిర్యాదులపై యాక్షన్ మొదలుపెట్టారు ఏపీ సీఎం జగన్. ఆక్వా ఉత్పత్తుల ధరల పతనం, ఫీడ్ ధర పెంపుపై రైతులు, రైతు సంఘాల నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని, దాని వల్ల నష్టపోతున్నామని రైతులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఫీడ్ విషయంలోనూ వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేస్తున్నారన్నది రైతుల ఆవేదన. ఈ సమాచారంతో వెంటనే రియాక్షన్ మొదలు పెట్టారు ముఖ్యమంత్రి జగన్.
రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ మంత్రుల కమిటీని నియమించారు. ఆయన ఆదేశించిన వెంటనే జీవో నెంబర్ 2081ని విడుదల చేశారు సీఎస్. ముగ్గురు మంత్రులు, అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, అప్పలరాజు ఈ కమిటీలో ఉన్నారు. సీఎస్, అటవీ, ఫిషరీస్ విద్యుత్ శాఖల స్పెషల్ సీఎస్‌లను, ఫిషరీస్ శాఖ కమిషనర్‌ను సభ్యులుగా నియమించారు.
ఈ కమిటీ రైతుల ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఆక్వా ఉత్పత్తుల ధరలు ఎందుకు పడిపోతున్నాయి, రైతుల ఫిర్యాదులు నిజమేనా, వ్యాపారులు సిండికేట్ అయ్యారా అన్న విషయాలపై విచారణ జరుపుతుంది. అన్నీ పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతులకు నష్టం చేస్తున్నారన్నది నిజమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..