Uddanam Kidney Hospital: ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జగన్ సర్కార్.. అందుబాటులోకి అత్యాధునిక కిడ్నీ ఆసుపత్రి

సరైన వైద్యం అందక, చికిత్సల కోసం దూర దూరాలు ప్రయాణం చేయలేక, ఆర్థిక స్తోమత లేక ఉద్దానం వాసులు పడే నరకయాతనను చూసి చలించిపోయారు ముఖ్యమత్రి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు.

Uddanam Kidney Hospital: ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జగన్ సర్కార్.. అందుబాటులోకి అత్యాధునిక కిడ్నీ ఆసుపత్రి
Uddanam Kidney Hospital
Follow us

|

Updated on: Dec 13, 2023 | 12:54 PM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పేరెత్తుతేనే కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉండటమే ఇందుకు కారణం. కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన బాధితులకు ఉపశమనం దొరికింది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అత్యాధునిక హంగులతో కూడిన ఆసుపత్రితో పాటు రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ అందుబాటులోకి రానుంది. వీటి నిర్మాణం కోసం రూ. 50 కోట్లు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

దశాబ్దాలుగా కిడ్నీవ్యాధుల వెతలు తీర్చేందుకు ఓ బృహత్తర ప్రయత్నం మొదలైంది. ఏళ్లకు ఏళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే ఉద్దానం ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒకపక్క సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

పాదయాత్ర సందర్భంగా ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు ఫించన్‌తో ఆత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. మాట ఇచ్చిన ప్రకారమే అధికారం చేపట్టిన మూడు నెలల్లోపే సెప్టెంబర్ 6, 2019న ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, రీసెర్చ్ సెంటర్ కు పునాదివేసారు సీఎం జగన్. నిర్మాణం పూర్తి చేసుకున్న భవనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్ ప్రారంభమైంది. ఉద్దానం ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందించనుంది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో సతమతం అవుతున్న ఉద్దానం ప్రజల ఆరోగ్యరక్ష సంకల్పం నెరవేరతోంది.

ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను అందించనున్నారు. అంతేకాదు వ్యాధి మూలాలను కనుగొనేందుకు పరిశోధనలు చేయడానికి వీలుగా అత్యంత అధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ ఆసుపత్రి నిర్మాణం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జార్జ్‌ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ TRI లతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది.

సరైన వైద్యం అందక, చికిత్సల కోసం దూర దూరాలు ప్రయాణం చేయలేక, ఆర్థిక స్తోమత లేక ఉద్దానం వాసులు పడే నరకయాతనను చూసి చలించిపోయారు ముఖ్యమత్రి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్‌ను రూ.85 కోట్ల అంచనా వ్యయంతో, సుమారు 3.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, నాలుగు అంతస్తుల్లో, 200 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 98 సాధారణ పడకలు, 102 ICU, పే రూమ్స్ పడకలు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 10 జనరల్ బెడ్స్‌తో క్యాజువాలిటీ, ఆసుపత్రి స్టోర్, మెడికల్, సెంట్రల్ ల్యాబులు, మెకనైజ్డ్ లాండ్రీ ఉంటాయి.

ఇక, మొదటి అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉంటాయి. రెండో అంతస్తులో 44 బెడ్స్ కలిగి ఉన్న అధునాతన ICU, 44 జనరల్ బెడ్స్ తో నెఫ్రాలజీ వార్డ్, 13 బెడ్స్ తో పే రూమ్స్ ఉంటాయి. అలాగే, మూడో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్ ICU వార్డు (17 ICU బెడ్స్ తో), ప్రి ఆపరేటివ్ వార్డ్ (7 ICU బెడ్స్ తో), C.S.S.D, ఐసొలేషన్ యూనిట్‌ (8 ICU బెడ్స్ తో), బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి. చివరగా నాలుగో అంతస్తులో 44 జనరల్ బెడ్స్‌తో యురాలజీ వార్డు, 13 బడ్స్‌తో పే రూమ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, లెక్చర్ హాల్ ఉంటాయి.

కిడ్నీ వ్యాధులకు అత్యవసర చికిత్సలు సహా అన్నీ అందించేలా అత్యాధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. CT స్కాన్, డిజిటల్ ఎక్స్‌ రే మిషన్ 500mA, ఎక్స్‌రే మిషన్‌ 300mA, PPP మోడ్ డయాలసిస్ మెషీన్, థిలియం లేజర్ – 60 వాట్స్, యురో డైనమిక్ మిషన్, 30- వాట్ హాల్మియం లేజర్-యురాలజీ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్‌లో మొత్తంగా 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోజూ నాలుగు షిప్టుల్లో రోజుకు 120 నుంచి 200 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పలాస పరిశోధనా కేంద్రం, ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు మొదలుకుని సాధారణ సిబ్బంది వరకూ అవసరమైన స్టాఫ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 జులై 3న ఉత్తర్వులు జారీ చేసింది. 47 మంది స్టాఫ్‌ నర్సులు, 43 మంది సపోర్టింగ్ స్టాఫ్, 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించింది.

ఉద్దానంలో ఇప్పటివరకు 37% మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్లకు పైగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఇందులో 21% ఉన్నారు. వీరికి అత్యాధునిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడగలం అంటున్నారు వైద్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు