Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు’… సీఎం జగన్ ఆదేశాలు

దేశంలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా..రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామన్నారు సీఎం జగన్ హామి ఇచ్చారు.

Andhra Pradesh: 'ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు'... సీఎం జగన్ ఆదేశాలు
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2021 | 9:00 PM

అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రాకుండా…ధరల స్థిరీకరణ నిధి ద్వారా అన్నదాతలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రైతులకు మంచి ధర వచ్చేలా చూడటమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ పోటీని పెంచేలా చూడాలని, దీనివల్ల రైతులకు సరైన ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకే రైతులకు లభిస్తున్నాయన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  దేశంలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా..రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామన్నారు సీఎం హామి ఇచ్చారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా పొటాష్‌ను తెప్పించుకున్నామని సీఎం తెలిపారు. ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లు పెట్టగానే వారికి ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావటం కొందని ఇష్టం లేనట్టుందని వ్యాఖ్యానించారు. ఎరువులు, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు.

ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని.. వచ్చే రబీ సీజన్‌ నుంచి ఇది అమల్లోకి వస్తోందని సీఎం చెప్పారు. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తృణ ధాన్యాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని… వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు.

‘జగనన్న పాలవెల్లువ’ పై సీఎం జగన్ సమీక్ష

‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమంపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపై కొందరు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు. అమూల్‌ ప్రైవేటు సంస్థ కాదని..పెద్ద సహకార ఉద్యమమన్నారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని.. లాభాలన్నీ తిరిగి రైతులకే వస్తాయని వివరించారు. ఇలాంటి కార్యక్రమంపైనా విష ప్రచారానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్‌ వచ్చాక  పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు.

Also Read: కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ

హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే