CM Jagan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ..
ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో విభజన హామీలు, పెండింగ్ బకాయిలపై చర్చ జరిగింది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో విభజన హామీలు, పెండింగ్ బకాయిలపై చర్చ జరిగింది. బుధవారం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన సంగతి తెలిసిందే. పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ సుధీర్ఘంగా ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే సీఎం జగన్ ప్రధానంగా ప్రధాని మోడీతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల అదేవిధంగా ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలపై మోడీకి వివరించారు.
దీంతోపాటు విభజన సమస్యలు, మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలకు సీఎం జగన్ ఇప్పటి నుంచే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
