Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఫైల్‌పై సంతకం చేసిన సీఎం జగన్
బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు సంతోషంలో మునిగిపోతున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతోంది.
AP News: బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ చెప్పింది. జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్(Cm jagan) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల సంతోషంలో మునిగిపోతున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అప్పుడు బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై త్వరలోనే స్పష్టత వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇప్పటివరకూ నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. కాగా బదిలీలకు సంబంధించి అధికారుల నుంచి సీఎం జగన్ కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తానికి త్వరలోనే రాష్ట్రంలో సాధారణ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.
గతంలో ఏపీలో 13 జిల్లాలు ఉండగా… ఉగాది నుంచి మరో 13 కొత్త జిల్లాలను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సాధారణ బదిలీల్లో కొంతమందిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి