పహల్గామ్ దాడికి ప్రతీకారంలో ఏపీ మీతోనే.. అమరావతి వేదిక నుంచి ప్రధానికి భరోసా
వంద పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌లో గడ్డికూడా పీకలేవని...పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఏపీ నినదించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందకు ప్రధాని మోదీ తీసుకునే ఏ చర్యకైనా ఏపీ మొత్తం వెంట ఉంటుందని.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వంద పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌లో గడ్డికూడా పీకలేవని…పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఏపీ నినదించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందకు ప్రధాని మోదీ తీసుకునే ఏ చర్యకైనా ఏపీ మొత్తం వెంట ఉంటుందని అమరావతి రీస్టార్ట్ వేదిక నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రధానికి భరోసా ఇచ్చారు.
పాకిస్తాన్ పై ప్రధాని తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని ఏపీ ప్రజల తరపున సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 28మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. ఈదాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రధానికి దేశం మొత్తం మద్దతుగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రధాని మోదీకి విజయవాడ భవాని అమ్మవారి దీవెనలు తోడుగా ఉంటాయన్నారు పవన్ కల్యాణ్. వంద పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌నేలపై గడ్డిపోచ కూడా పీకలేరని వారికి సమాధానం చెప్పే ఒక్క మిస్సైల్ మోదీ అని అన్నారు మంత్రి లోకేష్. అమాయకులను చంపి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందని భారత్ కొట్టే దెబ్బతో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అడ్రస్ గల్లంతవుతుందన్నారు లోకేష్.




