వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపింది. తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పిల్లలను పాఠశాలలు, కళాశాల్లో చదివించే తల్లులుకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఒడి పథకం పేరుతో ప్రతీ ఏటా రూ. 15000 విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు విడతల్లో వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా నాలుగో ఏడాది కూడా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అమ్మ ఒడి నాలుగో విడత సొమ్మును బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లు ఖాతాల్లో జమచేయనున్నారు. ఇందుకోసం గాను మన్యం జిల్లాలోని కురపాంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
కురుపాంలో ఏర్పాటు చేయనున్న బహరింగ సభకు వెళ్లేందుకు గాను ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి బయలు దేరనున్నారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి10 గంటలకు చినమేరంగి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..