Bullet Train: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఏపీలో తొలి స్టేషన్ అక్కడే.. రూట్ మ్యాప్ ఫిక్స్..
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైల్ కారిడార్ ఏపీ మీదుగా వెళ్లనుంది. అమరావతి మీదుగా చెన్నైకు వెళుతుంది. ఈ కారిడార్‌కు సంబంధించి ఇప్పుడు కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీలోకి రాగానే తొలి స్టేషన్ దాచేపల్లిలో ఉంటుంది. అలాగే భూసేకరణపై కూడా క్లారిటీ వచ్చింది.

ఏపీ మీదుగా వెళ్లే బుల్లెట్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఏపీ మీదుగా ప్రతిపాదించారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అమరావతి మీదుగా చెన్నైకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ఈ కారిడార్‌లో ఎక్కువ భాగం ఏపీలోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ మార్గానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఈ కారిడార్ ఏపీలోని పలు నగరాలు, పట్టణాలను కలపనుంది.
రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్-చెన్నై కారిడార్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వగానే తొలి స్టేషన్ పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉండనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు అయింది. ఇప్పటకే భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి జాతీయ హైస్పీడ్ రైలు సంస్థ ఏపీకి లేఖ రాసింది. భూమిని వీలైనంత త్వరగా అప్పగించాలని ఆదేశించింది. రెవెన్యూ రికార్డు, క్షేత్రస్థాయిలో భూముల సర్వే అనంతరం రైల్వేశాఖకు భూములను అప్పగించాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం భూసేకరణపై దృష్టి పెట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వం భూముల గుర్తించడం, గ్రామాల సరిహద్దులను మ్యాపింగ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఈ కారిడార్ పూర్తయితే అమరావతి నుంచి గంటలోనే చెన్నైకు చేరుకోవచ్చు. అలాగే ఏపీలోని ఇతర నగరాలకు నిమిషాల వ్యవధిలోనే ప్రయాణం చేయవచ్చు. అమరావతి-చెన్నై మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది.
ఎలివేటెడ్ కారిడార్..
ఎలివేటెడ్ కారిడార్ విధానంలో బుల్లెట్ రైల్ కారిడార్లు నిర్మించనున్నారు. అంటే నేలపై కాకుండా ఆకాశ మార్గంలో పిల్లర్లను నిర్మిస్తారు. దీని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకపోవడంతో పాటు ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్ల గరిష్ట వేగంతో బుల్లెట్ రైళ్లు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్‌లో భాగంగా ఏపీలోని పలు నగరాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటకే రూట్ మ్యాప్ సిద్దం అవ్వగా.. త్వరలో డీపీఆర్ పనులు మొదలుకానున్నాయి. కాగా దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో రానున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ వేగవంతంగా పనులు చేపడుతోంది. ఇప్పటికే ఈ కారిడార్ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని తెలుస్తోంది.
