AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సొంత పార్టీ ఎంపీకి అన్నగారి కుమార్తె క్లాస్.. వారు మహానుభావాలు అంటూ ట్వీట్‌

ఏపీలో బీజేపీలో ప్రకపంనలు చెలరేగుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య వార్ పతాక స్థాయికి చేరింది. ఇప్పుటికే పార్టీ మాజీ ప్రెసిడెంట్ కన్నా పార్టీని వీడారు.

Andhra Pradesh: సొంత పార్టీ ఎంపీకి అన్నగారి కుమార్తె క్లాస్.. వారు మహానుభావాలు అంటూ ట్వీట్‌
G. V. L. Narasimha Rao - Daggubati Purandeswari
Ram Naramaneni
|

Updated on: Feb 17, 2023 | 1:47 PM

Share

ఏపీ బీజేపీలో మరో వివాదం మొదలైంది. నిన్నటి వరకు సోము, జీవీఎల్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తే… ఇప్పుడు ఆ పార్టీలోనే కీలక నేత పురంధేశ్వరి జీవీఎల్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడం దుమారం రేపుతోంది. ఎన్టీఆర్‌, వైఎస్‌లపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యారు పురంధేశ్వరి. జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను అటాచ్‌ చేస్తూ మరీ కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలేనా, ఎక్కడ చూసినా ఆ ఇద్దరి పేర్లానా అంటూ నిన్న ఎన్టీఆర్‌, వైఎస్‌ పేర్లపై వ్యాఖ్యలు చేశారు జీవీఎల్‌. వంగవీటి రంగా పేరు కూడా జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఆ ఇద్దరూ అంటూ జీవీఎల్‌ అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పురంధేశ్వరి. ఆ ఇద్దరూ కాదు ఆ మహానుభావాలు అంటూ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపును తెచ్చి పేదలకు నిజమైన సంక్షేమం, రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారని ట్వీట్‌ చేశారు పురంధేశ్వరి. వైఎస్‌ఆర్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీని అందించారని గుర్తు చేశారు.

ఆ ఇద్దరూ అంటూ ఎన్టీఆర్‌, వైఎస్‌లను ఉద్దేశించి జీవీఎల్‌ పేర్కొనడాన్ని ఈ రకంగా, చాలా సీరియస్‌గా పురంధేశ్వరి రియాక్ట్‌ అవడం బీజేపీలోనే చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్