టీడీపీ కీలక నేతలకు స్పీకర్ ఝలక్..
వచ్చేనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు.. సభాహక్కుల నోటీస్ జారీ అయ్యాయి. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్‌లు ఏపీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులు పంపారు. అంతేకాదు.. ఈ ప్రివిలైజ్ నోటీసులు అందుకున్న వారిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు.. నారా లోకేష్ కూడా ఉన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే […]
వచ్చేనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు.. సభాహక్కుల నోటీస్ జారీ అయ్యాయి. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్‌లు ఏపీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులు పంపారు. అంతేకాదు.. ఈ ప్రివిలైజ్ నోటీసులు అందుకున్న వారిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు.. నారా లోకేష్ కూడా ఉన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు అందజేశారు. ఇక లేఖల రూపంలో స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా పేర్కొన్నారన్న ఆరోపణలపై నారా లోకేష్‌కు కూడా నోటీసులు అందజేశారు. వీటిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
కాగా, స్పీకర్‌పై కూన రవి కుమార్, అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా.. నారా లోకేష్ కూడా లేఖల రూపంలో స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరిచారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.