కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై యాసిడ్ దాడి..
గుంటూరు జిల్లా వినుకొండ తంగిరాలమెట్ట వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ భర్త ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను చదివించుకుంటుంది. ఉమ్మడివరం గ్రామం నుండి రోజూ వినుకొండకు కూలి పనులు చేసుకునేందుకు వచ్చే కోటేశ్వరమ్మపై అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి […]
గుంటూరు జిల్లా వినుకొండ తంగిరాలమెట్ట వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ భర్త ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను చదివించుకుంటుంది. ఉమ్మడివరం గ్రామం నుండి రోజూ వినుకొండకు కూలి పనులు చేసుకునేందుకు వచ్చే కోటేశ్వరమ్మపై అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కన్ను పడింది. తన కోరిక తీర్చాలని గత ఏడాది నుండి ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆమె లొంగకపోవడంతో..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల ఆరవ తేదీన ఉమ్మడివరం నుండి వినుకొండకు కోటేశ్వరమ్మ పనికి వెళ్లింది. అక్కడ పని లేకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరింది. తంగిరాలమెట్ట వద్దకు రాగానే ఆంజనేయులు ఆమెను అడ్డగించి తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె తన మాట వినలేదు. దీంతో కోటేశ్వరమ్మను గుట్టల్లోకి లాక్కెళ్లి తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ఒంటిపై పోశాడు. ఎవరికైనా చెబితే తన పిల్లలను చంపేస్తానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఒంటినిండా యాసిడ్ గాయాలతో ఊరిబయట పడిఉన్న బాధితురాలిని ఆమె బంధువులు..గమనించి వినుకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య చికిత్సలు అందజేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.