స్మార్ట్‌ఫోన్ దొంగలు..ఓ షోరూమే పెట్టొచ్చు !
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నలుగురు దొంగల ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో కాస్లీ స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఆకివీడు కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా, షిఫ్ట్ కారులో అనుమానాస్పదంగా వస్తున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లుగా నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద లభించిన దాదాపు రూ. 10లక్షలకు పైగా […]
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నలుగురు దొంగల ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో కాస్లీ స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఆకివీడు కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా, షిఫ్ట్ కారులో అనుమానాస్పదంగా వస్తున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లుగా నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద లభించిన దాదాపు రూ. 10లక్షలకు పైగా విలువచేసే 48 సెల్‌ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు జిల్లాతో పాటుగా చెన్నై, తిరుపతి రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలో సెల్‌ఫోన్లు కాజేసి ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు వివరించారు. పట్టుబడిన నలుగురు ఒరిస్సా, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ, ఆకివీడు గంగానమ్మకోడు ప్రాంతంలో నివాసముంటున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఒకరు మైనర్ కాగా, ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. మైనర్‌ను జువైనల్ హోంకు తరలించినట్లుగా డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.