Ongole JMB Church: జేఎంబీ చర్చిలో మరోసారి గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం..
ప్రార్థనలకు వచ్చినవారు.. రెండు వర్గాలు విడిపోయి తలపడుతుండడంతో.. వెంటనే ప్రార్థనలు ముగించాలని.. చర్చి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
ఒంగోలు జేఎంబీ చర్చిలో(JMB Church)మరోసారి గొడవ జరిగింది. ప్రార్థన చేసే విషయంలో ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం మొదలైంది. వెంటనే రెండు వర్గాలు వాగ్వాదానికి దిగారు. మైక్ వైర్లు తొలగించారు. ఆందోళన చేపట్టారు. ఒంగోలు జెఎంబి చర్చిలో గొడవ చినికి చినికి గాలివానలా మారుతోంది. పోలీసులు ఎంటరవ్వాల్సి వచ్చంది. ప్రార్థనలకు వచ్చినవారు.. రెండు వర్గాలు విడిపోయి తలపడుతుండడంతో.. వెంటనే ప్రార్థనలు ముగించాలని.. చర్చి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పాస్టర్ ప్రసాదరావు వర్సెస్ పాస్టర్ ఆషీర్ పాల్. ఒంగోలు జెఎంబి చర్చి గొడవ సారాంశం ఇది. ప్రసాదరావు, ఆషీర్ పాల్ వర్గాల మధ్య ప్రార్థనలు చేసే విషయంలో మూడేళ్ళుగా వివాదం కొనసాగుతోంది. రెండు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతి ఆదివారం ప్రార్థనలు మొదలుకాగానే ఇద్దరు పాస్టర్ల మద్దతుదారులు గొడవకు దిగడం పరిపాటిగా మారింది.
ఇక్కడ ప్రార్ధన చేయాల్సింది తమ పాస్టరంటే.. తమ పాస్టరంటూ నోటికి పని చెప్తున్నారు. మేము ప్రేయర్ చేయాలంటే.. మేము ప్రేయర్ చేసుకోవాలంటూ మైక్‌లు కట్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం జరుగుతున్న ఈ కొట్లాట పోలీసులకు తలనొప్పిగా మారింది.
గుంటూరు చర్చీ వివాదం..
గుంటూరులో చర్చి ఫాస్టర్స్ ఫైట్ పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఓ వర్గం బయట.. మరో వర్గం లోలప ఉండి.. ఢీ అంటే ఢీ అనుకున్నాయి. ఓ వర్గం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే.. మరో వర్గం మాకే జన బలం ఉందంటూ లోపల తిష్టవేసింది. అర్ధరాత్రి గుంటూరులోని AELC చర్చి హెడ్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు సంస్థ కార్యాలయం వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు పాస్టర్ పరదేశి బాబు, అతని అనుచరులు. అప్పటికే ఆఫీస్‌లో ఉన్న శ్యాం సంపత్ వర్గం ఆఫీస్‌లోకి రాకుండా అడ్డుకుంది.
అర్ధరాత్రి అనుమించేది లేదని తేల్చి చెప్పారు. హైకోర్టు ఆర్డర్ ఉందంటూ వాగ్వాదానికి దిగారు పరదేశి బాబు అండ్ గ్యాంగ్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. రెండు వర్గాలతో చర్చించి పరిస్థితిని చక్క దిద్దే పని చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు శాంతించిన పరదేశ బాబు.. వెనుదిరిగి వెళ్లిపోయారు.