Konaseema: గొర్రెలకు నీరు తాపేందుకు నదీ తీరానికి కాపరి.. మెరుస్తూ కనిపించిన రాయి.. చెక్ చేయగా

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం..పేరవరం గ్రామం..గోదావరి తీరంలో అరుదయిన రాయి లభ్యమైంది. దాన్ని అతడు భద్రంగా ఇంటికి తీసుకొచ్చాడు.

Konaseema: గొర్రెలకు నీరు తాపేందుకు నదీ తీరానికి కాపరి.. మెరుస్తూ కనిపించిన రాయి.. చెక్ చేయగా
Diamond Looklike Stone
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2022 | 1:19 PM

AP News: రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం నిత్యం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అదే నిజ జీవితంలో జరిగితే, నిరు పేద కుటుంబానికి సిరుల పంట కలిసి వస్తే .. ఆ ఇంట సంతోషానికి అవధులు ఉండవు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేలా కనిపిస్తుంది. ఓ గొర్రెల కాపరిని అదృష్టం వరించిందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. అనుకోకుండా తళ తళ మెరుస్తున్న వజ్రాలు లాంటివి పొదిగిన రాయి అతడికి దొరికింది. అయితే అవి విలువైనవా కాదా అనేది ఆర్కియాలజీ అధికారులు తేల్చనున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం(Atreyapuram Mandal) పేరవరం(Peravaram) గ్రామానికి చెందిన రమేష్ గొర్రెల కాపరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. రోజువారీ జీవితంలో భాగంగా మేతకు గొర్రెలను తోలుకెళ్లి.. మధ్యలో నీళ్లు తాగించేందుకు స్థానిక గోదావరి తీరానికి వెళ్లాడు. గోదావరిలో కళ్లు మిరిమిట్లు గొలిపేలా మెరుస్తూ ఒక తెల్లటి రాయి అతని కనిపించింది. రాయి మధ్యలో వజ్రాలు పొదిగినట్లు మెరుస్తూ ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దాన్ని తెలిసినవారికి చూపించడంతో వజ్రాలు అని చెప్పారట. దీంతో ప్రస్తుతం ఈ రాయిని ఇంట్లో భద్ర పరిచినట్లు టీవీ9కి తెలిపాడు గొర్రెల కాపరి రమేష్. అయితే, స్థానిక ఆర్కియాలజీ అధికారులు వస్తే గాని ఈ రాయికి ఉన్న విశిష్టత, అసలు విషయం బయట పడదు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!