YSR Nethanna Nestham: నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. వారి ఖాతాలో నాలుగో విడత డబ్బులు జమ
YSR Nethanna Nestham: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే 'వైఎస్సార్ నేతన్న నేస్తం' నాలుగో విడత..
YSR Nethanna Nestham: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు.10.50 గంటలకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొంటారు. ముందుగా వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
కాగా, నేతన్నల కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తోంది ప్రభుత్వం. ఐదేళ్లలో లబ్దిదారుడికి రూ.1,20,000 సాయం అందనుండగా, ఇప్పటికే మూడు విడతల్లో లబ్దిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యింది. ఇప్పుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి