Andhra pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. పలు ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు..!
యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరంగా చాలా మార్పులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు...
AP Weather Report: యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరంగా చాలా మార్పులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురవడంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సాధారణం కంటే 2-4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇక దక్షిణ కోస్తాంధ్రా పరిస్థితి చూసినట్లయితే.. ఈరోజు, రేపు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సాధారణం కంటే 2-4°C అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also read: