AP Rains: ఏపీలో భారీ వర్షాలు పడే ప్రాంతాలివే.. వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. తాజా వెదర్ రిపోర్ట్
ఫెంగల్ తుఫాన్‌తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా..
గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైనున్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనము పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు: —————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- —————————————-
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి