TTD: సంక్రాంతి ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడింది. 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు...

తిరుమల, జనవరి 15: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడింది. 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29,849 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకలు వల్ల హుండీకి రూ.3.13 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. సంక్రాతి సెలవుల వల్లనే భక్తుల రద్దీ అధికంగా ఉందని, స్వామి వారిని పండగవేళ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని అధికారులు అంటున్నారు. ఈ రోజు (సోమవారం) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న విశేషం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీయేట ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండగ సీజన్‌లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు పది రోజుల వరకు సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు, పెద్దలు పలు దేవాలయాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తిరుమల దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




