AP News: ఆ కోడి మాంసం కేజీ రూ. 1600.. ఇక పుంజు రేటు తెలిస్తే గుండె పట్టుకోవాల్సిందే.!

సంక్రాంతి పండుగకు జరిగే కోడి పందాలకు ఉపయోగించే కోడి ధర ఆకాశంలో రాకెట్‌లా భారీ స్థాయిని తాకుతోంది. కొన్ని కోట్ల రూపాయలతో సంక్రాంతి కోడి పందాలను నిర్వహిస్తుంటారు. తాజాగా కోస్తా జిల్లాలోని కోడి పందాలలో ఉపయోగించే కోడి విలువ..

AP News: ఆ కోడి మాంసం కేజీ రూ. 1600.. ఇక పుంజు రేటు తెలిస్తే గుండె పట్టుకోవాల్సిందే.!
Perviun Roosters
Follow us
M Sivakumar

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 3:49 PM

సంక్రాంతి పండుగకు జరిగే కోడి పందాలకు ఉపయోగించే కోడి ధర ఆకాశంలో రాకెట్‌లా భారీ స్థాయిని తాకుతోంది. కొన్ని కోట్ల రూపాయలతో సంక్రాంతి కోడి పందాలను నిర్వహిస్తుంటారు. తాజాగా కోస్తా జిల్లాలోని కోడి పందాలలో ఉపయోగించే కోడి విలువ అక్షరాలా 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు. ఈ కోళ్లను టాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఇక వాటి గురించి వివరిస్తూ పందెం రాయుళ్లు అధిక మొత్తంలో వ్యాపారాలు చేస్తారు. కోడి పందాల్లో ఉపయోగించే కోడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు పందెం రాయుళ్లు. ఒకటికి పదిసార్లు అలోచించి కోడి బరువు ఎంత.? ఎంత చలాకిగా ఉంది.? ట్రైనింగ్ ఎలా ఇచ్చారు.? ఈ కోడి పందెంలో విజయం సాధిస్తుందా.?అనేక ఆలోచనలతో కోళ్ల వ్యాపారం చేస్తారు.

విజయవాడకి చెందిన ప్రదీప్ కొన్ని సంవత్సరాలుగా పందెం కోళ్ల ఫారం నడుపుతూ సంక్రాంతికి నిర్వహించే కోడి పందాలకు ఎన్నో పందెం కోళ్లను తయారు చేశాడు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పెర్వియన్ బ్రీడ్‌కి చెందిన కోళ్లు భారీ ధర పలుకుతున్నాయని అతడు తెలిపాడు. కోళ్లను సంక్రాంతి పండుగకు 3 నెలల ముందు నుంచే స్పెషలిస్ట్ ట్రైనర్లచే కోడి పందాలకు సిద్ధం చేస్తారు. కోడి పందాలకు సిద్ధం చేసే పుంజులలో ఆరోగ్య పరిస్థితులను గమనించి ఎలాంటి వైరల్, రెస్పిరేటరీ వ్యాధులు.. పుంజులను బలహీనంగా చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

పెర్వియన్ జాతి కోడి పుంజులకు ప్రస్తుతం మార్కెట్‌లో బాగా డిమాండ్ పెరిగింది. పందెంలో ఎదుటి కోడిని ఓడించేంత వరకు దాడి చేసి, సత్తు కోల్పోని పెర్వియన్ పుంజు. పెర్వియన్ వంటి ఇతర దేశానికి చెందిన కోడి పుంజులను పందెం పోరులో నిలపటం అంత సులువు కాదు. సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంటేనే పెర్వియన్ పుంజులను పందానికి పంపుతారు. అలాగే పందెంలో చనిపోయిన పెర్వియన్ కోళ్ల మాంసానికి కూడా భారీ డిమాండ్ ఉంది. సాధారణ కోళ్ల మాంసమే కేజీ రూ. 500 ఉంటే.. ఈ కోళ్ల మాంసం ఏకంగా రూ. 1500 -1600 ఉంటుందని అంచనా.