AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti: కోనసీమలో సంక్రాంతి సెలబ్రేషన్ వైభవంగా జరుపుకుంటున్న ఉమ్మడి కుటుంబాలు..

ఇందుపల్లి గ్రామస్తులు ఉమ్మడి కుటుంబ సభ్యులు అంతా కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇందుపల్లి అరవగరువు గ్రామంలో సంక్రాంతి పండుగలు సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో స్థిరపడ్డ వారంతా సహసంపక్తి భోజనాలు, సామూహిక నృత్యాలు, పురాతన సంప్రదాయ గుర్రపు బల్లు, ఆవులు, ఎడ్ల బండ్లు.. ఇలా ఒకటేమిటీ మరుగున పడుతున్న సాంప్రదాయ వాతావరం ఉట్టిపడేలా సంక్రాంతి రోజు అందరూ ఏకమై ఆనందంగా గడిపారు..

Sankranti: కోనసీమలో సంక్రాంతి సెలబ్రేషన్ వైభవంగా జరుపుకుంటున్న ఉమ్మడి కుటుంబాలు..
Sankranti
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jan 15, 2024 | 2:57 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఇందుపల్లి గ్రామస్తులు ఉమ్మడి కుటుంబ సభ్యులు అంతా కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇందుపల్లి అరవగరువు గ్రామంలో సంక్రాంతి పండుగలు సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో స్థిరపడ్డ వారంతా సహసంపక్తి భోజనాలు, సామూహిక నృత్యాలు, పురాతన సంప్రదాయ గుర్రపు బల్లు, ఆవులు, ఎడ్ల బండ్లు.. ఇలా ఒకటేమిటీ మరుగున పడుతున్న సాంప్రదాయ వాతావరం ఉట్టిపడేలా సంక్రాంతి రోజు అందరూ ఏకమై ఆనందంగా గడిపారు..

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు… ఐదు సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు… తోటి కోడళ్ళు, అత్తలు, మావయ్యలు ఇలా మనవరాళ్లు ఒకరేమిటి బంధువులంతా ఒకటై..సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. నేడు సంక్రాంతి అంటే గుండాటలు, కోడి పందాలు కాదు.. మన సంప్రదాయాన్ని నేటితరం పిల్లలకు చెప్పడమే సంక్రాంతి అసలైన పండుగ అంటున్నారు పల్లెవాసులు .

సొంత ఊరును వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇలా అందరం ఒకేసారి కలవడం ఆనందంగా ఉందన్నారు ఉమ్మడి కుటుంబ సభ్యులు.. ఇలా నేటి తరానికి మా పిల్లలకు, సంక్రాంతి కోనసీమ తెలుగుదనం సంప్రదాయాలను తెలిసే విధంగా.. అన్ని ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇందుపల్లి వాసులు. కొంతమంది సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, అలా మర్చిపోకుండా ఉండేందుకే అందరం కలిసి ఈ పండుగ మూడు రోజులు అయినా.సరదాగా.. ఆనందంగా గడుపుతున్నామంటున్నారు పెద్దలు. గత కోన్నేళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని సంక్రాంతి సంబరాలను అరవగరువు గ్రామం ఇందుపల్లిలో జరుపుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…