Andhra Pradesh: వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్.. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఆదివారం మల్లికార్జున ఖర్గేతో మీటింగ్ తర్వాత రుద్రరాజు రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు.. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఆదివారం మల్లికార్జున ఖర్గేతో మీటింగ్ తర్వాత రుద్రరాజు రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. అయితే, పార్టీ కోసం అవసరమైతే పదవీత్యాగం చేస్తానంటూ గతంలోనే ప్రకటించిన రుద్రరాజు.. వైఎస్ షర్మిల చేరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, త్వరలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకమాండ్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లు పేర్కొంటున్నారు.
కాగా.. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణతో పాటు.. ఏపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. మణిపూర్ యాత్ర కొనసాగుతోంది. ఏపీ నుంచి వైఎస్ షర్మిల, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు.. రాహుల్ భారత్ జోడో న్యాయ్‌యాత్రలో పాల్గొంటున్నారు. అక్కడే గిడుగు రుద్రరాజుతో అధిష్టానం పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
