YV Subba Reddy: నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూపడా వివరించినట్టు తెలిపారు. అందుకే 2019 ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉన్నానని అన్నారు.

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూపడా వివరించినట్టు తెలిపారు. అందుకే 2019 ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉన్నానని అన్నారు. 2019 నుంచి టీటీడీ ఛైర్మన్‌గా, అనంతరం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని తెలిపారు. తన విషయంలో సీఎం ఏం నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి.
ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనో, మరే ఇతర పార్టీల వైఖరి చూసి తాము అభ్యర్దులను ఎంపిక చేయాల్సిన అవసరం లేదన్నారు సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్ధుల మార్పులు, చేర్పులపై దృష్టిపెట్టారని గుర్తు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల టికెట్ల మార్పులు చేర్పుల వ్యవహారంలో కొంతమంది అసంతృప్తికి లోనైన మాట వాస్తవమేనన్నారు. అయితే సి. రామచంద్రయ్య, బాలసౌరి లాంటివాళ్ళు వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడారని సుబ్బారెడ్డి తెలిపారు. అయా నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జిల పట్ల పార్టీ కేడర్ కొంత అసంతృప్తిగా ఉన్నా, త్వరలోనే అన్ని సర్దుబాటు చేసుకుని కలిసి కట్టుగా పని చేస్తారని సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల నాటికి మరిన్ని ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతాయని, పండగ తర్వాత నాలుగో లిస్టు ఉంటుందన్నారు. మా ప్రభుత్వం మీ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తేనే మాకు ఓటు వేయండి అంటూ ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ అభ్యర్థనతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్బంగా ఒంగోలులోని తన నివాసానికి వచ్చిన వైవి సుబ్బారెడ్డిని పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కేక్ కట్ చేశారు. తకు ముందు వైవి సుబ్బారెడ్డి కుటుంబసమేతంగా కలిసి గోపూజ నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి.
