వేసవి తాపంతో అల్లాడిపోతోన్న మూగజీవాలు.. జనారణ్యంలోకి చేరి తిప్పలు..
తాగునీటి కోసం భామిని ,కొత్తూరు మండలాల్లో ఏనుగులు గుంపు పొలాల్లో సంచరిస్తూ వ్యవసాయ పంపు సెట్లను, పైప్ లను తరచూ ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కృష్ణ జింక దారితప్పి పట్టణంలోకి ప్రవేశించింది. సమీపంలోని కొండలపై నుండి వచ్చి ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోకి చొరబడింది. మున్సిపల్ కార్యాలయంలో సంచరిస్తూ స్థానికుల కంట పడింది. దీంతో

ఎండ వేడిమీ, వేసవితాపం మనుషులు పైనే కాదు జంతువులు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జంతువులు సైతం దాహార్తికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చెట్లను నరికి వేయటం, మైనింగ్ తవ్వకాలు వంటి చర్యలు వల్ల క్రమేపీ అడవులు అంతరించి పోతున్నాయి. కంకర, గ్రావెల్ కోసం కొండలు,గుట్టలను సైతం తవ్వేస్తున్నారు. దీంతో అడవిలో ఉండే మన్య మృగాలు తమ నివాసాలను కోల్పోవటంతో పాటు, వేసవికాలం వచ్చిందంటే చాలు తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రానులు జనారన్యం భాట పడుతున్నాయి.
సువిశాల సముద్ర తీరం, ఎత్తైన తూరుపు కనుమలు, నాగవలి, వంశధార, మహేంద్ర తనయ వంటి నదీ ప్రవాహాలను కలిగిన జిల్లా శ్రీకాకుళం. అందుకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం తో పాటు సీతంపేట, కొత్తూరు, భామిని మండలాలు వన్య ప్రాణులకు ఆవాసాలుగా ఉంటాయి. ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, దుప్పిల సంచారం ఎక్కువగా ఉంటుంది. సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో ఏనుగుల సంచారం ఎక్కువ. ఆమధ్య జిల్లాలో కొద్ది నెలలపాటు పెద్దపులి కూడా సంచరించి ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి తరలిపోయింది. అయితే ఇక్కడ కూడా పట్టణీకరణ జరగటం, అడవులు క్రమేపీ అoతరిస్తుడంటoతో వేసవి కాలం వచ్చిందంటే చాలు వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం, ఆహారం కోసం గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. తాగునీటి కోసం భామిని ,కొత్తూరు మండలాల్లో ఏనుగులు గుంపు పొలాల్లో సంచరిస్తూ వ్యవసాయ పంపు సెట్లను, పైప్ లను తరచూ ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కృష్ణ జింక దారితప్పి పట్టణంలోకి ప్రవేశించింది. సమీపంలోని కొండలపై నుండి వచ్చి ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోకి చొరబడింది. మున్సిపల్ కార్యాలయంలో సంచరిస్తూ స్థానికుల కంట పడింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దానిని సoరక్షించారు.
వీడియో ఇక్కడ చూడండి..
దాహార్తితో ఇలా అభయారణ్యం నుండి జనారన్యం బాట పడుతూ వన్యప్రానులు ఒక్కోసారి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాయి. గ్రామాల్లోకి వస్తున్న వన్యప్రాణులు కొన్నిసార్లు వేటగాళ్ల బారిన గాని, వీధి కుక్కల బారిన గాని పడి ప్రాణహాలు కోల్పోతున్న సందర్భాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కిందటి నెల వీరగట్ట మండలం వండువ ప్రభుత్వ పాఠశాల వద్ద ఒక జింక గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. కొన్నేళ్ల కిందట భామిని మండలంలో విద్యుత్ ఘాతంకి గురయ్యి నాలుగు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. వినేపద్యంలోనే అటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. వన్యప్రాణులను వేటాడటం, వధించటం చట్టరీత్యా నేరం అంటూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. పొరపాటున వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




