Watch: భారీ వర్షం..ఈదురుగాలుల బీభత్సం.. ఏకంగా ఎగిరి పడిన టోల్ ప్లాజా..! ఎక్కడంటే..
భారీ ఈదురు గాలులకు టోల్ ప్లాజా అమాంతంగా విరిగి పడింది. గాలులతో కూడిన వర్షానికి తట్టుకోలేక టోల్ ప్లాజా నేలమట్టం అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకృతి విలయం అంటే ఇదేమరీ అంటూ చాలా మంది రకరకాలుగా స్పందించారు.

దేశంలోని పలు రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నదుల్ని తలపించేలా ప్రవహించింది. ఎటు చూసినా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 100కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఆలస్యం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే, తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోనూ కుండపోత వర్షం కుమ్మరించింది. ఈదురు గాలులకు చెట్లు, ఇళ్ల పైకప్పులు మాత్రమే కాదు.. ఏకంగా ఒక చోట టోల్ ప్లాజానే ఎగిరి పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
వీడియో ఇక్కడ చూడండి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలో భారీ ఈదురు గాలులకు టోల్ ప్లాజా అమాంతంగా విరిగి పడింది. గాలులతో కూడిన వర్షానికి తట్టుకోలేక టోల్ ప్లాజా నేలమట్టం అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకృతి విలయం అంటే ఇదేమరీ అంటూ చాలా మంది రకరకాలుగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




