PM Modi: సీఎం చంద్రబాబు నాకు మంచి మిత్రుడు.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్..
ఆంధ్రుల ఆశ, ఆకాంక్షగా ఉన్న అమరావతి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా రీస్టార్ట్ చేశారు.. ఈ వేడుకలో అడుగడుగునా రైతులకు జై కొట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా.. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటూ పొరాటం కొనసాగించిన వారి సంకల్పానికి సెల్యూట్ కొట్టారు.

ఆంధ్రుల ఆశ, ఆకాంక్షగా ఉన్న అమరావతి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా రీస్టార్ట్ చేశారు.. ఈ వేడుకలో అడుగడుగునా రైతులకు జై కొట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా.. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటూ పొరాటం కొనసాగించిన వారి సంకల్పానికి సెల్యూట్ కొట్టారు. అయితే.. రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఏపీ ప్రజలు గానీ ఏవైతే ఆశించారో.. అవే మాటలు వినిపించాయి ప్రధాని మోదీ నుంచి.. ‘కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులు’ అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు ప్రధాని మోదీ. అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందన్న విషయం తన కళ్ల ముందు మెదులుతోందని చెప్పడంతో.. అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ చెరిగిపోయినట్టే కనిపించాయి ఏపీ ప్రజలకి… ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి ఇది ఒక నవశకమని, చీకటిపై ఆశ గెలిచిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడేళ్లల్లో అమరావతి పనులను పూర్తిచేస్తామని ప్రకటించారు. అమరావతి కేవలం కాంక్రీటు, ఉక్కు కట్టడం మాత్రమే కాదని, అది రాష్ట్ర ప్రజల కలలకు, ఆశయాలకు నిలువెత్తు నిదర్శనమంటూ వివరించారు.
చంద్రబాబు నిబద్ధతను అభినందిస్తున్నాను: ప్రధాని మోదీ..
కాగా.. అమరావతి పున:నిర్మాణం పనులను ప్రారంభించిన అనంతరం ఢిల్లీ వెళ్లిన ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అంటూ పేర్కొ్న్నారు. ‘‘అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను’’.. అంటూ ట్వీట్ చేశారు.
అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది.
అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
నాకు మంచి… pic.twitter.com/bHzY3r5XSz
— Narendra Modi (@narendramodi) May 2, 2025
ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం: చంద్రబాబు కీలక ట్వీట్..
అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి…. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అంటూ ట్వీట్ చేశారు.
#AmaravatiRestart ప్రధాని శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా… pic.twitter.com/2Yo75RVK2X
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..