AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pak: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. ఇక చావు దెబ్బే!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ నుండి వచ్చే అన్ని వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ప్రకటించారు.

India vs Pak: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. ఇక చావు దెబ్బే!
Trade Gate
Anand T
|

Updated on: May 03, 2025 | 1:21 PM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. భారత్‌లో జరిగిన ఉగ్రదాడి వెనకాల పాకిస్థాన్ హస్తం ఉందని భావించిన భారత్‌ ఆదేశానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్‌ పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే కాకుండా అక్కడి నుంచి ఎగుమతైన వస్తువులను కూడా భారత్‌లోకి అనుమతించేది లేదని భారత వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.  జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితి విధిండం జరిగిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్‌ వాణిజ్యశాఖపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. భారత్‌ పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్‌తో భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం చాలా తక్కువగా ఉంది. భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యంలో పాకిస్తాన్‌తో జరిగే వాణిజ్యం కేవలం 0.06 శాతం మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అయితే 2019లో పుల్వామా దాడి తర్వాతనే భారత్‌-పాకిస్తాన్‌ నుంచి దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు.. ఈ దేశ ఉత్పత్తులపై సుమారు 200 శాతం సుంకం విధించింది.

కాగా జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని దర్యాప్తులో తేలడంతో.. పాకిస్థాన్‌ సహకారంతోనే ఈ ఉగ్రదాడి జరిగినట్టు భారత్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ దేశస్తులను దేశం నుంచి పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోవడం వంటి నిర్ణయాలతో పాటు, భారత్-పాక్ మధ్య ఉన్న దౌత్య ఒప్పందాలను కూడా రద్దు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..