AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఇదేక్కడి తాగుబోతు పామురా సామీ.. ఏకంగా చెట్టెక్కి మరీ జుర్రేస్తోంది..!

పాములలో కొన్ని చాలా పొడవుగా ఉంటాయి. మరికొన్ని చాలా పొట్టిగా ఉంటాయి. కొన్ని పాములు చాలా విచిత్రమైన శరీరాలను కలిగి ఉంటాయి. వాటి చర్మం పొట్టుగా, గరుకుగా మారడం మీరు గమనించవచ్చు. అలాగే, పాములు తమ జీవితకాలంలో చాలాసార్లు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా చెట్టెక్కి కల్లు తాగుతున్న పామును చూశారా..? ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఇదేక్కడి తాగుబోతు పామురా సామీ.. ఏకంగా చెట్టెక్కి మరీ జుర్రేస్తోంది..!
King Cobra Snake
Jyothi Gadda
|

Updated on: May 03, 2025 | 3:01 PM

Share

భూమిపై ఉన్న అత్యంత పురాతమైన, విషపూరిత జీవులలో పాములు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పాములు 150 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉన్నాయి. పాములు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తాయి. ఎడారి పాములు ఎడారులలో నివసిస్తాయి. అయితే నీటి సర్పాలు సమృద్ధిగా నీరు ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి. ఇలాంటివి ఈ భూమిపై వివిధ రకాల పాములు నివసిస్తాయి. అలాగే, పాముల ఆకారం ఆయా జాతులను బట్టి మారుతుంది. ఈ పాములలో కొన్ని చాలా పొడవుగా ఉంటాయి. మరికొన్ని చాలా పొట్టిగా ఉంటాయి. కొన్ని పాములు చాలా విచిత్రమైన శరీరాలను కలిగి ఉంటాయి. వాటి చర్మం పొట్టుగా, గరుకుగా మారడం మీరు గమనించవచ్చు. అలాగే, పాములు తమ జీవితకాలంలో చాలాసార్లు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా చెట్టెక్కి కల్లు తాగుతున్న పామును చూశారా..? ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

పాములకు ఉన్న ప్రధాన లక్షణం పాకడం. ఇవి ఎంత దూరమైన ఈజీగా పాకుతూ వెళ్తాయి. అవసరమైతే చెట్లు, గోడలు వంటివి కూడా ఎక్కేస్తుంటాయి. వాటికి కావాల్సిన ఆహారంలో చెట్లపై ఉంటే అవి ఖచ్చితంగా చెట్టెక్కి వేటాడి మరీ కడుపునింపుకుంటాయి. ఇక్కడ ఒక పాము సరిగ్గా ఇలాంటి పనినే చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ సర్పం తాటి చెట్టు పైకి ఎక్కింది. చెట్టు మీద ఉన్న కుండలోని కల్లును అది దాని నాలుకతో నాకి తాగుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో @shatrudhanbabasharpmitra.9733 అనే యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈ రకమైన పాములు కనిపించడం చాలా అరుదు అంటున్నారు మరికొందరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..