Andhra: డబ్బుల బ్యాగు స్కూటీలో పెట్టుకుని బయల్దేరాడు.. కొంతదూరం వెళ్లాక
లక్ష రూపాయల సొత్తు.. తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయల్దేరాడు ఓ వ్యక్తి. కొంతదూరం వెళ్లాక ఆకలేసి ఓ హోటల్ దగ్గర ఆగాడు. అక్కడ టిఫిన్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది. స్కూటీ దగ్గరకు వెళ్లగానే.. డిక్కీలోని డబ్బు కనిపించలేదు. ఆ తర్వాత ఏమైంది..
కృష్ణాజిల్లా ఉయ్యూరులో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. స్థానిక పెద్ద మార్కెట్ వద్ద ఓ వ్యక్తి స్కూటీలో ఉంచిన నగదును చోరీ చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన మణి అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో రూ. 1.50 లక్షల క్యాష్ ఉంచి హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా.. అనూహ్యంగా చోరీ చేశాడు ఓ దుండగుడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ దొంగతనం సీసీ టీవీలో రికార్డు కావడంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published on: May 03, 2025 04:03 PM
వైరల్ వీడియోలు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

