
తనకల్లు, అక్టోబర్ 17: అభం, శుభం తెలియని ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు ఓ కామాంధుడు. విద్యా,బుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ పదహారేళ్లకే తల్లిని చేశాడు. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు తెలుగు టీచర్. గుట్టు చప్పుడు కాకుండా ఉన్న ఈ వ్యవహారం కాస్త మైనర్ బాలిక డెలివరీ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో కీచక టీచర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై తెలుగు ఉపాధ్యాయుడు మాయమాటలతో లొంగదీసుకున్నాడు. విషయం ఇంట్లో చెప్పొద్దని మైనర్ బాలికను బెదిరించాడు… చేసిన తప్పు ఎక్కువ రోజులు ఆగదు, తెలియదు అనుకుంటే పొరపాటే? సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. మాయమాటలతో లొంగదీసుకున్న మైనర్ బాలిక గర్భవతి అయి, బిడ్డకు జన్మనివ్వడంతో ఒక్కసారిగా కామాంధుడి రాసలీలలు బట్టబయలయ్యాయి. మైనర్ బాలిక పదవ తరగతి చదువుతున్న సమయంలో తెలుగు టీచర్ ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గర్భవతి చేశాడు.
అయితే సదరు మైనర్ బాలిక ఇంటర్మీడియట్ చదువుతుండగా కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లకపోవడంతో పాటు ప్రసవ నొప్పులు రావడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. పదహారేళ్ళ వయసులో బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అని పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మైనర్ బాలిక పదో తరగతి చదువుతున్న సమయంలోనే తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు తనకల్లు ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడుని అరెస్ట్ చేశారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ టీచర్ చేసిన ఘోరానికి ఇంటర్ విద్యార్థిని బలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.