AP Polycet 2023 Exam: మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ పాలీసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్.. పరీక్ష కేంద్రాల్లోకి 10 గంటల్లోపే అనుమతి

|

May 10, 2023 | 9:09 AM

ఆంధప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్‌–2023 పరీక్ష బుధవారం (మే 10) జరగనుంది. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు..

AP Polycet 2023 Exam: మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ పాలీసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్.. పరీక్ష కేంద్రాల్లోకి 10 గంటల్లోపే అనుమతి
AP Polycet 2023 Exam
Follow us on

ఆంధప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్‌–2023 పరీక్ష బుధవారం (మే 10) జరగనుంది. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతిలేదన్నారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు.

ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నామని కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వేలకు పైగా ప్లేస్‌మెంట్లు సాధించినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.