Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచే తొలి ఘట్టం.. ఏపీ పంచాయతీ పోరుకు అంతా సిద్ధం.. మొదలైన నామినేషన్ల స్వీకరణ

ఇవాళ్టి నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకణ ప్రక్రియ మొదలైంది.

నేటి నుంచే తొలి ఘట్టం.. ఏపీ పంచాయతీ పోరుకు అంతా సిద్ధం.. మొదలైన నామినేషన్ల స్వీకరణ
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 29, 2021 | 7:12 AM

AP local polls Nominations : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సర్వసన్నద్దమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ్టి నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకణ ప్రక్రియ మొదలైంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని ఎస్ఈసీ తెలిపింది. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు శుక్రవారం నుంచి ఆదివారం (జనవరి 31) సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఈ బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు ఫిబ్రవవరి 7 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు.. 9న పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని భీమవరం, ఉండి, ఆకివీడు,కాళ్ళ, పాలకొడేరు, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం,మొగల్తూరు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాలలో నామినేషన్లు స్వీకరిస్తారు. 12 మండలంలోని 239 గ్రామ పంచాయతీలకు, 2,552 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ప్రతీ రెండు గ్రామాలకు ఒక రిటర్నింగ్ అధికారి నియామించి ఎస్ఈసీ.

కాగా, ప్రకాశం జిల్లాలో పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13న రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లోని చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, చీమకుర్తి, మద్దిపాడు, కొత్తపట్నం, మార్టూరు, నాగులుప్పలపాడు మండలాల్లో మొదటి దశలో జరుగుతాయి. రెండో దశలో 13న కందుకూరు డివిజన్‌లోని దర్శి, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, మర్రిపాడు మండలాలు.. ఒంగోలు డివిజన్‌లోని జె.పంగలూరు, కొరిశపాడు, సంతమాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో ఫిబ్రవరి 17న కందుకూరు డివిజన్లలోని కందుకూరు, వీవీపాలెం, లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు, ఎస్‌ కొండ, కనిగిరి, పీసీపల్లి, వెలిగండ్ల, హెచ్‌ఎం పాడు, సీఎస్‌ పురం, పామూరు, పొన్నలూరు, కొండెపి, జరుగుమల్లి మండలాల్లోని పంచాయతీలకు ఎన్నిక ఉంటుంది. నాలుగో విడత ఫిబ్రవరి 21న మార్కాపూర్‌ డివిజన్‌లోని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లోని గోపాలపురం మండలానికి మూడో దశకు బదులుగా రెండో దశలో ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏలూరు డివిజన్‌లో చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోని పంచాయతీలకు నాలుగో దశకు బదులుగా మూడో విడతలో ఫిబ్రవరి 17కు మార్చారు. ఫిబ్రవరి 9న నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని పంచాయతీల్లో.. రెండో విడత ఫిబ్రవరి 13న కొవ్వూరు డివిజన్‌లోని పంచాయతీలకు.. మూడో విడత ఫిబ్రవరి 17న జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాలు, కుక్కునూరు డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, ఏలూరు డివిజన్‌లోని చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నాలుగో విడత ఫిబ్రవరి 21న ఏలూరు రెవెన్యూ డివిజన్‌లోని భీమడోలు, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, గణపవరం, నల్లజెర్ల, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read Also…  జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు లైన్‌క్లియర్.. క్లారిటీ వచ్చిన ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య