Andhra Pradesh: ‘ఖరము పాలు గరిటడైన చాలు..’ గాడిద పాలకు పెరిగిన డిమాండ్‌! ఎగబడి కొంటోన్న జనం

| Edited By: Srilakshmi C

Sep 21, 2023 | 2:14 PM

'గంగి గోవు పాలు గరిటెడైనా చాలు.. కడివడైన నేమి ఖరము పాలు..' వేమన పద్యంలోని తొలి రెండు పంక్తులు ఇవి. ఖరము అంటే గాడిద పాలు నిరుపయోగమైనవని వేమన పద్యం లోని సారాంశం. అయితే ఇపుడు సీన్ రివర్స్ అయింది. గోవు పాలు తాగే వారు తగ్గి గాడిద పాలు కోసం ఎగబడే వారు పెరిగిపోతున్నారు. దీంతో వీటి పెంపకం దారులు వీధుల్లో తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తున్నారు. ఇపుడు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గాడిద పాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రండి బాబు రండి... మంచి తరుణం మించిన దొరకదు. ఆలసించిన వారికి ఆశయాభంగం..

Andhra Pradesh: ఖరము పాలు గరిటడైన చాలు.. గాడిద పాలకు పెరిగిన డిమాండ్‌! ఎగబడి కొంటోన్న జనం
Donkey Milk
Follow us on

ఏలూరు, సెప్టెంబర్‌ 21: ‘గంగి గోవు పాలు గరిటెడైనా చాలు.. కడివడైన నేమి ఖరము పాలు..’ వేమన పద్యంలోని తొలి రెండు పంక్తులు ఇవి. ఖరము అంటే గాడిద పాలు నిరుపయోగమైనవని వేమన పద్యం లోని సారాంశం. అయితే ఇపుడు సీన్ రివర్స్ అయింది. గోవు పాలు తాగే వారు తగ్గి గాడిద పాలు కోసం ఎగబడే వారు పెరిగిపోతున్నారు. దీంతో వీటి పెంపకం దారులు వీధుల్లో తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తున్నారు. ఇపుడు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గాడిద పాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రండి బాబు రండి… మంచి తరుణం మించిన దొరకదు. ఆలసించిన వారికి ఆశయాభంగం.. అనే విధంగా జోరుగా గాడిద పాలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఏంటి గాడిద పాలకు అంత డిమాండ్ ఉందనుకుంటున్నారా.. అవును మీరు అనుకుంటున్నది నిజమే! గాడిద పాలకు ఉన్నంత డిమాండ్ మరి ఏ పాలకు లేదు.

ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు గాడిద పాల ద్వారా నయం చేయవచ్చని చెబుతున్నారు. మైక్ లో అనౌన్స్మెంట్లు చేసి మరి గాడిద పాలు అమ్ముతుంటే జనం ఊరకనే ఉంటారా.. వాటిని కొనేందుకు ఎగబడుతున్నారు. అసలు ఎక్కడ గాడిద పాలు అమ్ముతున్నారు? వాటి ధర ఎంత? గాడిద పాలు త్రాగటం ద్వారా తగ్గే దీర్ఘకాలిక వ్యాధులు ఏమిటి..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఓ మైక్ అనౌన్స్మెంట్ ఇళ్లలో నిద్రిస్తున్న స్థానికులను బయటకు వచ్చేలా చేసింది. ఆ అనౌన్స్మెంట్ వినగానే స్థానిక ప్రజలు పరుగు పరుగున రోడ్లమీదకు వచ్చారు. గాడిద పాలు.. గాడిద పాలు.. ఆయాసానికి, ఉబ్బసానికి, జలుబుకి, దగ్గుకి అంటూ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన ఓ గాడిద యజమాని తన గాడిదను తీసుకుని ద్వారకాతిరుమలకు వచ్చాడు.

అక్కడ వీధివీదినా తిరుగుతూ గాడిద పాలు అమ్మకాలు జోరుగా సాగించాడు. గాడిద పాలు తాగడం ద్వారా ఆయాసం, ఉబ్బసం, దగ్గు, జలుబు, గురక, కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు వంటి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని చెబుతున్నాడు గాడిద పాలు యజమాని.. అంతేకాక గాడిద పాలు మనిషికి మంచి బలమని, అవి త్రాగడం ద్వారా ఎటువంటి హాని ఉండదని తెలిపాడు. అయితే తాను అమ్మే గాడిద పాలు కూడా చాలా కాస్ట్లీ గా వున్నాయి. గాడిద యజమాని దగ్గర ఉన్న రెండు గిన్నెలలో పాలు స్వయంగా స్థానికుల ముందే తీసి అమ్ముతున్నాడు. అందులో పెద్దవాళ్లకైతే పెద్ద గిన్నెడు పాలు.. చిన్నపిల్లలకైతే చిన్న గిన్నెడు పాలు విక్రయిస్తున్నాడు. పెద్ద గిన్నెడు పాలు రూ.900, చిన్న గిన్నెడు పాలు రూ.600గా ధర నిర్ణయించాడు.

ఇవి కూడా చదవండి

పెద్దవాళ్లకైనా, చిన్నవాళ్ళకైనా ఒక రోజులో మూడు పూటలు ఆ పాలు పట్టించాలని గాడిద యజమాని చెబుతున్నాడు. తాను నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటానని ఆ తర్వాత వేరే ఊరు వెళ్లిపోతానని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాడు. అయితే ఆయాసం, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న స్థానికులు సైతం గాడిద పాలను జోరుగా కొనుగోలు చేశారు. అయితే గాడిద పాలు త్రాగటం ద్వారా అతను చెప్పిన రోగాలు తగ్గుతాయో లేదో తెలియదు కానీ ప్రజలు మాత్రం గాడిద పాలు తాగితే అనారోగ్య పరిస్థితులు గురికాకుండా ఉంటామని గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.