Acharya Nagarjuna University: పరీక్షలకు సిద్ధమవుతుండగా ఆగిన కొడుకు గుండె.. పీజీ పట్టా అందుకుంటూ కుమిలిపోయిన తల్లి!

| Edited By: Srilakshmi C

Aug 31, 2023 | 2:41 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవానికి పల్లెటూరి నుండి ఒక మహిళ వచ్చింది. పిహెచ్ డి, పిజి పట్టాలు అందుకునే సమయంలో విద్యార్ధులు ధరించే డ్రెస్ వేసుకుంది. అందరిలాగే విశ్వవిద్యాలయం అధికారుల చేతులుగా మీదుగా పట్టా అందుకుంది. పట్టా అందుకుంటున్న సమయంలో ఆమె కళ్ల నుండి కన్నీరు ఆగలేదు. తన బాధనంతా గుండెలోనే దాచుకుని పట్టా..

Acharya Nagarjuna University: పరీక్షలకు సిద్ధమవుతుండగా ఆగిన కొడుకు గుండె.. పీజీ పట్టా అందుకుంటూ కుమిలిపోయిన తల్లి!
Sugunamma
Follow us on

గుంటూరు, ఆగస్టు 31: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవానికి పల్లెటూరి నుండి ఒక మహిళ వచ్చింది. పిహెచ్ డి, పిజి పట్టాలు అందుకునే సమయంలో విద్యార్ధులు ధరించే డ్రెస్ వేసుకుంది. అందరిలాగే విశ్వవిద్యాలయం అధికారుల చేతులుగా మీదుగా పట్టా అందుకుంది. పట్టా అందుకుంటున్న సమయంలో ఆమె కళ్ల నుండి కన్నీరు ఆగలేదు. తన బాధనంతా గుండెలోనే దాచుకుని పట్టా అందుకుంది. అసలు చదువే రాని మహిళ పట్టా అందుకోవడం వెనుక ఏంజరిగిందని అక్కడకు వచ్చిన వారంతా ఆరా తీశారు. అప్పుడుగాని ఆమె అసలు బాధ బయటకు రాలేదు. అసలేం జరిగిందంటే..

ఆమె పేరు సుగుణమ్మ, బాటప్ల జిల్లా పెద గంజాం ఆమె స్వగ్రామం..అక్షరం ముక్క రాని సుగుణమ్మ వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు పోతురాజును బాగా చదివించాలనుకుంది. కూలీ పనులు చేస్తూనే చదివించింది. ఆమె ఆశలకు తగినట్లుగానే పోతురాజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పిజి సీటు సాధించాడు. 2016 2018 లో పిజీ పూర్తి చేయడమే కాకుండా జియాలజీలో బంగారు పతకం సాధించాడు. అంతటితో ఆగిపోలేదు. తన తల్లి కలలను నెరవేర్చే క్రమంలో గేట్ పరీక్ష రాయలనుకున్నాడు. ప్రవేశ పరీక్ష రాసేందుకు 2019లో హైదరాబాద్ వెళ్లాడు. పరీక్ష కోసం సిద్దమవుతున్న సమయంలోనే గుండె పోటుతో పోతురాజు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సుగుణమ్మ కన్నీరు మున్నీరుగా విలిపించింది. కొడుకు లేడన్న బాధను దిగమింగుకొని జీవనం సాగిస్తుంది.

అయితే కొద్దీ రోజుల క్రితం నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆమె కబురు వచ్చింది పోతురాజు జియాలజీలో బంగారు పతకం సాధించాడని ఆ పట్టా అందుకోవడానికి 40వ సాతకోత్సవానికి రావాలని ఆమెకు అధికారులు చెప్పారు. అక్షరం ముక్క రాని ఆమె ఏం చేయాలో తోచలేదు. అయితే పోయిన కొడుకు ఎలాగు తిరిగి రాడు కనీసం తను సాధించిన పట్టానైనా అందుకోవాలన్న బంధువుల సూచనతో స్నాతకోత్సవానికి హాజరైంది. అందరి ముందు కన్నీటితోనే కొడుకు సాధించిన బంగారు పతకాన్ని, పట్టాను అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఆమె కథ తెలుసుకున్న వారందరికీ కళ్లు చెమర్చాయి. ప్రతిభా పాటవాలు పుష్కలంగా ఉన్న పోతురాజు కోల్పోయామని అధ్యాపకులు చెబుతుంటే ఆమె బాధ మరింత పెరిగింది. కొడుకు లేకపోయిన వాడు సాధించిన పతకం, పట్టాను అందుకొని కొడుకును చూసినంతగా ఆమె మురిసి పోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.