Sangameswaram: సంగమేశ్వరంలో అద్భుతం.. హరహర మహాదేవ అంటూ పరవశించిపోయిన భక్తులు..!

సంగమేశ్వరంలో అద్భుతం కనిపించింది. ప్రతీ ఏటా ఏదో ఓ రూపంలో కృష్ణానది మారడం భక్తులను ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే.. సప్తనదుల సంగమం.. మన సంగమేశ్వరం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న సంగమేశ్వరంలో అద్భుతం చోటు చేసుకుంది.

Sangameswaram: సంగమేశ్వరంలో అద్భుతం.. హరహర మహాదేవ అంటూ పరవశించిపోయిన భక్తులు..!
Lord Shiva
Follow us

|

Updated on: Apr 02, 2023 | 7:25 AM

సంగమేశ్వరంలో అద్భుతం కనిపించింది. ప్రతీ ఏటా ఏదో ఓ రూపంలో కృష్ణానది మారడం భక్తులను ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే.. సప్తనదుల సంగమం.. మన సంగమేశ్వరం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న సంగమేశ్వరంలో అద్భుతం చోటు చేసుకుంది. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో భీమలింగం ఉండే ప్రాంతంలో నీరు పాణిమట్టం ఆకారంలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న శివలింగం, నీటి ఆకారం చూడ్డానికి ఒకేలా కనిపించడం మహాద్భుతం అంటున్నారు భక్తులు.

సంగమేశ్వరంలో ప్రతీ ఏటా ఏదో ఓ అద్భుతం వెలుగుచూస్తూనే ఉంది. గతంలో నీళ్లు తగ్గే సమయంలో పాముగాని, పిల్లి గాని ఆకారంలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు పాణిమట్టం ఆకారంలో దర్శనమివ్వడంతో భక్తులు పరవశంలో ఉన్నారు. మరో ఆరు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే భీమలింగం బయటపడుతుందంటున్నారు పురోహితులు. మరోవైపు సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సాంబశివనాయుడు దంపతులు. వారికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. చైత్ర శుక్ల ఏకాదశి శనివారం కావడంతో సంగమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించారు చీఫ్‌ జస్టిస్‌ సాంబశివనాయుడు దంపతులు.

అనంతరం కృష్ణానది గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ. వీరి వెంట నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ జడ్జీలు, న్యాయశాఖ సిబ్బంది కూడా ఆలయ కార్యక్రమాలు పాల్గొన్నారు. నల్లమల ప్రాంతం కావడంతో.. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..