AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వచ్చే ఏడాది ఏప్రిల్ 14 లోపు ఏపీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. ఢిల్లీలో ఏపీ మంత్రుల బృందం..

Andhra Pradesh: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 కల్లా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాం నిర్మాణం పూర్తి చేస్తామంటోంది ఏపీ మంత్రుల బృందం.

Andhra Pradesh: వచ్చే ఏడాది ఏప్రిల్ 14 లోపు ఏపీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. ఢిల్లీలో ఏపీ మంత్రుల బృందం..
Ambedkar
Shiva Prajapati
|

Updated on: Sep 14, 2022 | 6:27 AM

Share

Andhra Pradesh: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 కల్లా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాం నిర్మాణం పూర్తి చేస్తామంటోంది ఏపీ మంత్రుల బృందం. ఢిల్లీ శివారులో జరుగుతున్న మోడల్‌ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రులు.. పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అవును, ఏపీలోని విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాం ఏర్పాటుకు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విగ్రహ నిర్మాణం పనులను పరిశీలించేందుకు ఏపీ మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించింది.

ఢిల్లీ టూర్‌లో అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంత్రులతో పాటు.. పలువురు అధికారులు కూడా పనులను పరిశీలించారు. బీఆర్‌ అంబేద్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌ పథకంలో భాగంగా విజయవాడలోని PWD మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం పనులను చూసేందుకు హర్యానా గురుగావ్‌లోని మనేసర్‌లో ఉన్న మాథురామ్‌ స్టేడియాన్ని మంత్రులు సందర్శించారు. అక్కడ జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు మంత్రులు, అధికారులు.

అయితే.. ఇక్కడ బంక మట్టితో చేసిన చేసిన అంబేద్కర్‌ విగ్రహ నమూనాను పరిశీలించింది ఈ బృందం. విగ్రహ నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకే ఢిల్లీకి పర్యటనకు వచ్చినట్టు మంత్రులు తెలిపారు. రాబోయే అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14 నాటికి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులన్నీ ఏక కాలంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్లాన్‌ రెడీ చేశారు. విగ్రహం పనులను వేగంగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అంబేద్కర్‌ విగ్రహ కమిటీ మంత్రుల టీమ్‌ ఛైర్మన్‌ మేరుగు నాగార్జున. సీఎం జగన్‌ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో వైసీపీ ప్రభుత్వ నడుస్తుందన్న మంత్రి.. విగ్రహం నిర్మాణానికి 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్