AP Corona Vaccine: ఏపీకి చేరిన కరోనా వ్యాక్సిన్.. ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు నడుమ జిల్లాలకు టీకాల తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కరోనా వ్యాప్తిపై అప్రమత్తమైంది. ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
AP Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కరోనా వ్యాప్తిపై అప్రమత్తమైంది. ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ వెంటనే యాక్షన్ ప్లాన్‌పై అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. సోమవారం మరోసారి సీఎంతో భేటీ అయ్యే అవకాశం కూండా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ సమావేశంలో ఆంక్షలు, వైద్యంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోంది.. అవును నువ్వు విన్నది నిజమే నీ చుట్టూ ఉన్న గాలిలో వైరస్ ఉంది. అంతర్జాతీయ పరిశోధనల్లోనే ఇది స్పష్టమైంది. దగ్గినా, తుమ్మినా గాలిలోకి కరోనా వైరస్ చేరుతున్నట్టు లాన్సెట్ సర్వే స్పష్టం చేసింది.
దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా టీకా ఉత్సవ్ జరుగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది. దేశంలోనే అత్యధికంగా రోజుకు 6లక్షల మందికి పైగా వ్యాక్లిన్ వేస్తోంది. గ్రామ సచివాలయాలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు.
నెల రోజుల్లో దాదాపు కోటి మందికి టీకా వేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం 60లక్షల టీకాలు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో భాగంగా దాదాపు 6లక్షల వ్యాక్సిన్ డోసులను పంపింది. పుణే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ప్రత్యేక విమానంలో టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. పటిష్ట బందోబస్తు మధ్య వ్యాక్సిన్ డోసులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు భద్రపరిచారు. వ్యాక్సిన్లను ప్రాధాన్యత క్రమంలో అన్ని జిల్లాలకు అధికారులు సరఫరా చేశారు. వ్యాక్సిన్లు ప్రత్యేక వాహనాల్లో ఆయా జిల్లా కేంద్రాలకు తరించారు. దీంతో ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఊపందుకోనుంది.
జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసుల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం 23,450 డోసులు కోవిషీల్డ్ 5 వేలు డోసులు కోవాక్సిన్
విజయనగరం 21,300 డోసులు కోవిషీల్డ్ 5 వేలు డోసులు కోవాక్సిన్
విశాఖపట్నం 51,450 డోసులు కోవిషీల్డ్ 15 వేలు డోసులు కోవాక్సిన్
తూర్పు గోదావరి 53,350 డోసులు కోవిషీల్డ్ 7 వేలు డోసులు కోవాక్సిన్
పశ్చిమ గోదావరి 32,700 డోసులు కోవిషీల్డ్ 5 వేలు డోసులు కోవాక్సిన్
కృష్ణా జిల్లా 42,650 డోసులు కోవిషీల్డ్ 15 వేలు డోసులు కోవాక్సిన్
గుంటూరు 56,300 డోసులు కోవిషీల్డ్ 12 వేలు డోసులు కోవాక్సిన్
ప్రకాశం 31,500 డోసులు కోవిషీల్డ్ 5 వేలు డోసులు కోవాక్సిన్
నెల్లూరు 26,800 డోసులు కోవిషీల్డ్ 5 వేలు డోసులు కోవాక్సిన్
చిత్తూరు 54,800 డోసులు కోవిషీల్డ్ 8 వేలు డోసులు కోవాక్సిన్
కర్నూలు 39,500 డోసులు కోవిషీల్డ్ 6,500 డోసులు కోవాక్సిన్
కడప 26,300 డోసులు కోవిషీల్డ్ 5,500 డోసులు కోవాక్సిన్
అనంతపురం 39,900 డోసులు కోవిషీల్డ్ 6 వేలు డోసులు కోవాక్సిన్
జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించిన వ్యాక్సిన్లను అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలిస్తారు. ఇప్పటికే జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లడంతో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టీకా డోసులు సరఫరా చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.
మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా ఉందని శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉత్సవంలా నిర్వహిస్తున్నందుకు అధికారులను సీఎం జగన్ అభినందించారు.
Read Also… Remdesivir: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ‘రెమ్‌డెసివిర్’ ధరలు భారీగా తగ్గింపు.. వివరాలివే..